అంతరంగము నందు నపరాధములు చేసి

bookmark

అంతరంగము నందు నపరాధములు చేసి
మంచి వానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
చాటుమాటున నెన్నో తప్పులు చేసియు , మంచి వానివలె మనుజుఁడు నటించు గాక , ఇతరు లెఱుగనంత మాత్రమున ఈశ్వరుడు ఎఱుఁగక పోడుగదా ?