వేరు పురుగు చేరి వ్రుక్షంబు జెఱచును

bookmark

వేరు పురుగు చేరి వ్రుక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు జెఱుచు
కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
వేమన శతకంలో వేమన లోకంలో ఉన్న చెడ్డవాళ్ళను ఇలా చెట్టు పురుగుతో పోల్చాడు. చెట్టు యొక్క వేరుకు పురుగు చేరి గొప్ప చెట్టును పాడు చేయును. చీడ పురుగు చిన్న చెట్టును నశింపజేయును. అదే విధంగా ఒక చెడ్డవాడు గుణము కలిగిన వాడిని నాశనము చేయును వర్ణించాడు. అందుకే పెద్దలకు చెడ్డవారికి దూరంగా ఉండమంటారు.