విశ్వశాంతి బాటలు
పలు మతాల భాషల పరిమళాల కదంబం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
ఉరికేటి నదులు మన జానపదులు
వికసించే తోటలు వినిపించే పాటలు
వేదఘోషలు బౌద్ధ వాక్కులు
గుభాళించి పరచినవి విశ్వశాంతి బాటలు
మానవాళి వికాసమే భారతీయ తత్వం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
సకల కళారామమిదే మా నివాసము
అందరినీ ఆదరించు సర్వథామము
ఇలాతలముపై వెలసిన స్నేహదీపము
సమత మమత రూపమే మా దేశము
జనహితమే మా జాతి చల్లని హృదయం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
