మనదేశం
భారతదేశం మనదేశం
భారతీయులం మనమంతా
దేశసేవే మన కర్తవ్యం
భరతమాతే మన సర్వస్వం
మమతా సమతలు
మానవ విలువలు
మన నడతలలో చూపిన
మనదేశ ప్రగతి పధంలో
మున్ముందుకు పోతుంది
మురిపాలను అందిస్తుంది
జాతి ప్రగతికి రూపునిచ్చీ
జగతి జనులకు శాంతినిచ్చీ
మార్గదర్శకమైన దేశం
మరులు గొలిపే స్వర్గం
ఇదే మన భారతదేశం
దేశప్రజలను సేవిద్దాం
దేశమాతను పూజిద్దాం
దేశదేశాల మన పేరు
స్థిరంగా నిలుపుదాం
