మంచి మాటలు - 8

bookmark

* మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.
* మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
* మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
* అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
* మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.
* విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.
* కష్టాలను ఆహ్వానించేవారు అని వచ్చిన తరువాత ఎల్లప్పుడూ పిర్యాదు చేస్తారు.
* విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.
* పిరికితనంలాంటి పాపం వేరొకటి లేదు.
* మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.

* నిజం కోసం మనం అన్నింటిని త్యజించవచ్చును. కానీ దేనికైనా సరే నిజాన్ని మాత్రం త్యజించకూడదు.
* మంచి మంచిని, చెడు చెడును ఆకర్షిస్తుంది.
* వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
* నెపము లెన్నువాడు తనను తాను నిందించుకునేవాడు.
* వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
* మనం ఉన్న తీరు మన ఆలోచనల ఫలితమే.
* హృదయానికి భూషణం సంస్కృతి అయినట్లే విద్య మనసుకు భూషణం.
* సంతృప్తికి మించిన సంపద లేదు. ఆనందానికి మించిన ఆస్తి లేదు.
* వ్యాధి కంటే మనిషిని భయమే ఎక్కువగా చంపుతుంది.
* ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఇతరులను తన వెంటనడిపింపజేసే నాయకుడు అవుతాడు.