మంచి మాటలు - 7
* ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్ళు అవుతారు.
* ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
* ఇక్కడి సూర్యాస్తమయం ప్రపంచపు మరో వైపుకు చెందిన సూర్యోదయం.
* ఆలస్యం చేయడమే కోపానికి పనికొచ్చే అత్యుత్తమ చికిత్స.
* వ్యాధి కంటే మనిషిని భయమే ఎక్కువగా చంపుతుంది.
* ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు.
* హృదయానికి భూషణం సంస్కృతి అయినట్లే విద్య మనసుకు భూషణం.
* ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
* వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమౌతుంది.
* అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
* అడుగునున్న ఆకు రాలిపోయినప్పుడు పైనున్న ఆకు నవ్వకుడదు ……
రేపటి వంతు తనదే మరి .
* అందరినీ అన్ని వేళలా సంత్రుప్తిపరచాలనుకుంటే ఓటమి తప్పదు .
* మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు…..
హృదయం.
* మాటను మించిన మహా ఔషధం లేదు .మాటను మించిన మహా యుద్ధమూ లేదు .
* భూమిపై సంపాదనంతా పోగేసినా నిజాయితీపరుడి ఓటు కొనలేరు . ( మహాత్మా గాంధీ )
* మనిషి ఆధిక్యత గల ప్రాణి కాబట్టి , తక్కువ జాతి ప్రాణులను ఏదైనా చేయవచ్చని కాదనీ ,చిన్నప్రాణులని పెద్దవి విధిగా రక్షించాలి .ఒక మనిషితో మరో మనిషి సంభంధంలాగా పశుపక్ష్యాదులతో మన సంభంధం ఉండాలి . ( మహాత్మా గాంధీ )
* నీటితో శరీరం శుభ్రపడుతుంది . సత్యంతో మనసు ప్రకాశిస్తుంది .
* కాలాన్ని మార్చలేవు .నీవే కాలానికి తగినట్టు మారాలి .
* మహాత్ములు సౌఖ్యాలలోను ,విపత్తులలోను ఒకే విధంగా వుంటారు .
* సంతోషంగా వుండే వారి వలన అనేక మంది సంతోషంగా వుంటారు .
