మంచి మాటలు - 5
* అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
* ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
* బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
* ఆరాధన భావంతో సేవను చేయండి.
* అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
* వ్యక్తిగతశాంతి విశ్వశాంతికి బాటను వేస్తుంది.
* వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
* చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
* మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.
* మనుషులను విమర్శిస్తూ పోతే వారిని ప్రేమించడానికి మీకు సమయం దొరకదు.
* జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
* గొప్పవారు ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఇతరులు కోరికలను కలిగి ఉంటారు.
* ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
* సరళత్వం అన్నది గెలుపు తాళం చెవిలాంటిది దీంతో అన్ని తాళాలను తీయవచ్చును.
* తన మతం యొక్క హృదయాన్ని మనిషి చేరుకోగలిగితే అతడు ఇతరుల హృదయాన్ని కూడా చేరుకోగలడు.
* అహంభావం, సందేహం, మూఢవిశ్వాసం, కామం, ధ్వేషం- ఈ
* మీ మెదడుకూ, హృదయానికీ ఘర్షణ జరిగిన పక్షంలో మీ హృదయాన్ని అనుసరించండి.
* ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.
* జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.
* విద్య లేని వారికి కీర్తి లేదు.
