మంచి మాటలు - 2

bookmark

* మీరు మనుషులను గురించి ఆలోచిస్తారు. కానీ దేవుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాడు.
* మరొక కొవ్వొత్తిని వెలిగిండం వల్ల కొవ్వొత్తి కోల్పోయేది అంటూ ఏమీ ఉండదు.
* లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.
* ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
* తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.
* సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.
* మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
* ఉదయం దినాన్ని సూచించినట్లే బాల్యం మనిషిని సూచిస్తుంది.
* ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.
* భగవంతుడు ప్రేమించబడేవాడే కాని భయాన్ని కలిగించేవాడు కాదు.

* ఏదైనా కానివ్వాండి అతి అన్నది చెడ్డది.
* సత్యపు మార్గమే శాంతి మార్గం.
* పరిచయం అవమానాన్ని పొందితే అపురూపత ప్రశంసలను గెలుచుకుంటుంది.
* మాటలు కాదు మనసు ముఖ్యం.
* ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి – లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
* ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది ముళ్ళను చూస్తాడు.
* సామాన్యులు ప్రార్ధించరు. యాచిస్తారు.
* మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.
* మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
* ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.