మంచి మాటలు - 1
* పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.
* ఆపదలను ఎదుర్కోకుండా నిజంకు ఎప్పుడూ విజయం లభించలేదు.
* వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
* సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.
* నిస్వార్ధతా భావమే శాంతికి బలమైన పూనాది.
* నిజమైన స్నేహం బంగారం లాంటిది.పాతదయినంత మాత్రనా దాని విలువ తరగదు.
* మనలో ప్రశాంతతను మనం కనుగొనలేనప్పుడు దానికోసం బయట వెదకడం దండగ.
* చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
* ఆనందమయ జీవితం మానసిక ప్రశాంతతపై ఆధారపడి ఉంటుంది.
* సులభంగా తయారయే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి.
* మీరు చేయలేనిదాన్ని మీరు చేయగలిగిన దానితో జోక్యం చేసుకోవడానికి అనుమతించకండి.
* వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
* నీకై నీవు మంచిగా ఉండటం – ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.
* ప్రశంసం అద్భుతాలను సాధిస్తుంది.
* సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
* భయం మనిషిని గుడ్డివాడిని చేసి అతడిని నిరాశతో కూడినవాడిగా తయారు చేస్తుంది.
* నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.
* ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే – దేవుడే ప్రేమ.
* కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
* ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.
