నెత్తిమీద గోరింక
ఓఅ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక;
చెప్పకు చెప్పకు చెడిపోతావు,
చెప్పితే నీ ముక్కు తెగ్గోస్తా,
దూలంమీంచీ దూకిస్తా,
పందిరిమీంచీ పాకిస్తా,
కంచం అన్నం తినిపిస్తా,
కడివెడునీళ్లు తాగిస్తా!
