నా జన్మభూమి

bookmark

నా జన్మభూమి... భూమి... భూమి...
నా జన్మభూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ || నా జన్మభూమి ||

నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ||నడిచే||
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం హొయ్ నా సామిరంగ || నా జన్మ ||

బతకాలందరు దేశం కోసము
దేశమంటేను మట్టికాదోయ్ మనుష్యులోయ్
స్వార్ధము వంచన లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యము హొయ్ నా సామిరంగ || నా జన్మ ||