నవభారతదేశం

bookmark

ఇది సుందర దేశం నవభారత దేశం
మృదు మంజులనాదం పురిగొల్పిన వేదం || ఇది ||
గల గల గల సవ్వడి గమకాలకు పల్లవి
అలనురగల వెల్లుడి పలికించిన అల్లరి
జ్వనదులె సంగమ సారాలకు తేటని
ప్రేమ ఎదల కలయికయే వెలుగొందిన జీవని || ఇది ||
కులమతమను బేధము మనకెందుకు మిత్రుడా!
మతమౌధ్యాలెందుకు? భరతజాతి పుత్రుడా!
భాషలు వేరైనను భావమొకటి కనుమురా
భేదము లెంచకురా భారతికే ముప్పురా || ఇది ||
మారణ హోమాలను రగిలించుట తగదని
మానసదీపాలను వెలిగించుట సుఖమని
నడవడు లొకటైతే కలదందున రసధుని
కులమతమను తేడాలను వీడితే శుభశశి || ఇది ||