దొంగబువ్వ
అన్నము పెట్టేవాళ్లు ముద్దలు కలిపి కన్నులుమూసుకొని
ఒక్కొక్క ముద్దఎత్తి పట్టుకొని ఇట్లు చెప్పుతారు.
కుక్కే వచ్చి తింటుందో, నక్కేవచ్చి తింటుందో!
యెలికే వచ్చి తింటుందో, చిలకే వచ్చి తింటుందో!
పిల్లే వచ్చి తింటుందో, బల్లే వచ్చి తింటుందో!
మా అమ్మాయే తింటుందో!
మా అబ్బాయే తింటాడో!
యెవరు వచ్చి తింటారో,
యెవరు వచ్చి తింటారో!!
ఇట్లా చెపుతూ చెయ్యి అటూ ఇటూ తిప్పుతూ ఎరుగనట్టు బిడ్డ ముఖముదగ్గరకు
తీసుకొనిపోతే, తాను కానట్టు గటుక్కున మ్రింగును.
ఇట్లు అంతా తినిపించిన తర్వాత,
"చాకలి వాళ్ల కుక్క వచ్చి చల్లా అన్నం తినిపోయింది, పో ...
అమ్మాయి (అబ్బాయి) యింక నీకేది? నీకు లేదులే..."
అని ముగించి మూతి, చెయ్యి కడుగుతారు.
