తెలుగు సూక్తులు - 2
1. అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
2. అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
3. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
4. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.
5. అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.
6. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
7. అసూయ ఆత్మకు పచ్చకామర్లు.
8. అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.
9. అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
10. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
11. ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
12. ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.
13. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.
14. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
15. ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
16. ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.
17. ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏపనీ చేయలేవు.
18. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
19. ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.
20. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.
21. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
22. ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.
23. ఆదర్శవాదికి అందరూ విరోధులే.
24. ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.
25. ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.
26. ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
27. ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.
28. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.
29. ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
30. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
31. ఆరాధన భావంతో సేవను చేయండి.
32. ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.
33. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.
34. ఆరోగ్యం పరమ ప్రయోజనం.
35. ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
36. ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.
37. ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
38. ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.
39. ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.
40. ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.
41. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.
42. ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.
43. ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.
44. ఆశ జీవితం జీవితమే ఆశ.
45. ఆశలేని వాని కగచాట్లులేవు.
46. ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
47. ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.
48. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
49. ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.
50. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
