తెలుగు సామెతలు-స
* సంకటాల విత్తు - సానిదాని పొత్తు.
* సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏమవుతుంది?
* సంక నాకేవాణ్ణి సంభావన అడిగితే, పొర్లించి పొర్లించి ముడ్డి నాకినాడట.
* సంకురాత్రి మబ్బులు మాలవాళ్ళ ఉబ్బులు.
* సంక్రాంతికి చంకలెత్తకుండా చలి.
* సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోని వాళ్ళూ వస్తారు.
* సంగాం కొమ్మ చక్కగా ఎత్తినట్లు. (సంగాం కొమ్మ= సంగములో పెద్దరాతి స్థంభమును ఎత్తి తిరునాళ్ళ ప్రారంభింతురు. పెన్నలో బొగ్గారు, బీరావుటెరు కలిసే సంగమం ఇది).
* సంగీతం, పురుషుని హృదయంలో అగ్నిని రగుల్కొల్పాల - స్త్రీనేత్రంలో భాష్పముల నింపాల.
* సంగీతము చేత సెట్టి బేరసారము లుడిగెన్ (బంగారువంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగెన్
* సంగీత విద్యకు చాకలెల్లి.
* సంచిలాభం చిల్లి కూదతీసినది.
* సంచీ విప్పేవఱకు చల్లబడితే, మూత విప్పేవఱకు మాటలు పోతవి.
* సంజకు, లంజకు రాగము నిలకడగా నిల్చునా? (రాగము=ఎరుపు, ప్రేమ).
* సంతకు దొంగయితే చీరలమ్మే దెక్కడ?
* సంతకు దొంగలయితే, చోళ్ళెక్కడ అమ్ముకోను?
* సంతకు పోయివచ్చిన ముఖం మాదిరి (వాడిపోయి వత్తురు - తిరునాళ్ళకు పోయి వచ్చినట్లు).
* సంతన లేని ఇల్లు చావడికొట్టం.
* సంత పాతతొత్తు సన్యాసి నెఱుగునా?
* సంత మెఱ్గు సాని ఎఱుగును.
* సంతలో కొడితే సాక్షులెవరు?
* సంతళొ బేరము లచ్చికి గాజులకు సరి.
* సంతానానికని సప్తసాగరయాత్ర వెడితే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడ్చుక పోయిందట.
* సంతోషం సగం సత్తువ
* సంతోషము సగం బలం.
* సంతోషానికి సాకు లేదు, ఆలోచన కంతులేదు.
* సందడిలో సడేమియా, నీకూ నాకూ లడేమియా.
* సందడిలో సమారాధన! (చేసినట్లు).
* సందాయ సందాయ అంటే చిచ్చాయ చిచ్చాయ అన్నదట.
* సందుజూచి పెట్టెలు దించినట్లు (పీర్ల పెట్టెలు).
* సందు దొరికితే, చావడికొట్టం చంక బెట్టినట్లు.
* సంధ్య వార్చినావురా? అంటే, ఊరివెలుపల గుంటలో వార్చినా నన్నాడట. అయితే ఆ గుంటలో నీళ్ళు లేవే? అంటే, చాకలి సుబ్బుడు ఉన్నవని చెప్పినాడు నాయనా! అన్నాడట.
* సంపద గలదేని సన్నిపాతము పూను.
* సంపదగలిగినవాని సన్నిపాతం వలె.
* సంపదగలిగిన్ తల్లికి వేకటిగాని తీరదు.
* సంపదలున్న నాడే బంధువుల రాక, చెరువు నిండినవాడే కప్పల చేరిక.
* సంపదలో మరపులు, ఆపదలఓ అఱపులు.
* సంపద స్నేహితులను కల్పించును, దరిద్రము వారిని ఒకటిగా బంధించును.
* సంపద ఒకరిది, అనుభవం ఇంకొరరిది.
* సంబరపు చలిగాలికి ఎదురువాకిలి వలె.
* సంబరానికి సోకి పోసికుంటే, కిక్క జమిడికే ఏనుకపోయిందట (జమిడికే=జంటాయికే).
* సంభావనలో వచ్చిన పావలా లోటు, నేతిలో తీస్తా నన్నట్టు.
* సంసారం గట్టి, మెడ ఒట్టి.
* సంసారం గుట్టు, వ్యాధి రట్టు.
* సంసారం జానెడు, ఖర్చు బారెడు.
* సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే, బూడిద బుఱ్ఱకాయ గాడిద బరువైనాయట.
* సంసారం లేనివారికి సరసాలెక్కువ.
* సంసారం సాగనిది ఆడదాని వ్రాత, పిల్లలు బ్రతకనిది మొగవాని వ్రాత.
* సంసారికి సాగు వాటు, సన్యాసికి జోగు వాటు.
* సంసారి తిరిగి చెడును, సన్యాసి (జోగి) తిరుగక చెడును.
* సంసారి దుఃఖి, సన్యాసి సుఖి.
* సంసారి బీద గానీ చేను బీద గాదు.
* సంసారి సైయ్ - సన్యాసి సైయ్ అన్నాడట చలికిచచ్చే సన్యాసి.
* సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టువంటిది
* సకలశాస్త్రాలు, నిలబడి మూత్రాలు.
* సకలసబ్బండు గోత్రానాం, పుల్లమ్మ పుత్రానాం.
* సక్కీలు పలికెవానికి సేలు(రు), మొద్దుగొట్టేవానికి దుడ్డు.
* సగం ఈడుకు సమర్తకట్నాలు.
* సగం చచ్చి పురాణం, అంతాచచ్చి సంగీతం.
* సగం పెట్టి, మేనత్త అన్నట్లు.
* సగం సాలె నేత, సగం మాల నెత.
* సజ్జనుండు తిట్ట శపంబదేను.
* సద్దంత ఊర్రగాయ; ఇల్లంత పందిలి, తల్లంత పిల్ల.
* సతాకోటి (శతకోటి) జంగాలలో, నాబోడిలింగ మెక్కడన్నాడట.
* సతిపతులు చక్కగాఉంటే, సంతలో పిల్లచింత లేదు.
* సత్కార్యాలకు కార్యరంగం అంతరాత్మ.
* సత్యము నావద్ద చాలా ఉన్నది. చెప్పులుతేరా మగడా! నిప్పులో దూకుతాను.
* సత్యములు పొత్తు కుడుచునా? బాసలు కలసివచ్చునా?
* సత్యహరిశ్చంద్రుడు పుట్టిన మరునాడు పుట్టినా డన్నట్లు.
* సత్రం కూటికి అయ్యగారి ఆఙ్ఞా
* సత్రం కూటికి అయ్యగారి సెలవెందుకు?
* సత్రంలో ఉచ్చబోస్తున్నవేమిరా? అంటే - దేవాలయం అనుకొన్నలే అన్నాడట.
* సత్రా భోజనం - మఠా నిద్ర
* సత్యాఢ్యులమీదబోవు జడమూర్తులు గెల్పువాటింతురే?
* సదా కపటమతిన్ దొరంగు మహికాంతులకేడ పరోపకారముల్.
* సద్దలు(సజ్జలు) వండితే సుద్దు లెక్కువ.
* సద్దిబువ్వపై వెన్నపూస బెట్టినట్లు.
* సన్నపని చేయబోతే సున్నం సున్నం అయ్యిందట.
* సన్నబియ్యం, చాయపప్పు.
* సన్నబువ్వ చిన్నచేపలు, కొఱ్ఱబువ్వ గోడిచారు.
* సన్నమో, ముతకో, సంతలో తేలిపోతుంది.
* సన్న సన్నంగా కాపుతనం వచ్చింది, సన్నబియ్యం వండవే అన్నాడట.
* సన్నెక(లు)ల్లు కడుగరా సయ్యదాలీ! అంటే, కడగినట్లే నాకినా, ఖుదా తోడు; అన్నాడట.
* సన్నెకల్లు దాచితే పెండ్లికాదా?
* సన్యాసం చివర కష్టం, సంసారం మధ్య కష్టం.
* సన్యాసం పుచ్చుకున్నా, కావడిబరువు తప్పలేదు.
* సన్యాసికి దొంగల భయమేమి?
* సన్యాసి పెళ్ళాం అటు విధవా కాదు, ఇటు పునిస్త్రీ కాదు.
* సన్యాసి పెళ్ళికి జుట్టుదగ్గరనుంచి ఎరవే (అరవె).
* సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందట.
* సన్యాసులమధ్య కల్లుకుండలు మాయమైనట్లు.
* సభమధ్య సాలె చాకలి, పండితులమధ్య పాగదాసరి.
* సభాపిరికిదానా! యింతిలో లేడనిచెప్పవే!
* సమయంతప్పితే కాళ్ళు, సమయంవస్తే రాళ్ళు.
* సమయము కాదనుట జరుపు నేర్పు.
* సమయమెరుగ(ని) నతడు సరసుండుకాడయా.
* సమయానికి లేనిది చంకనాకనా?
* సమయానికి లేని పాక చచ్చినాకా?
* సమర్తయీడు చాకలిదాన్ని కొట్టింది.
* సముద్రం నడుమ ఉన్నా, త్రాగునీటికి కరవే.
* సముద్రంపై ఉఱిమితే, వన తప్పదు (గాలివాన).
* సముద్రమయినా ఈదవచ్చుగానీ, సంసారం ఈదలేము.
* సముద్రము చంకలో ఓట్టుకొని, చెలమకు చేయి చాచినట్లు.
* సముద్రములో ఇంగువ కలిపినట్లు.
* సముద్రంలో పెట్ట రెట్ట వేసినట్లు.
* సముద్రములో కెరటాలు అణిగిన తరువాత స్నానం చేదామనుకున్నాడట.
* సముద్రములో కొఱవి అద్దినట్లు.
* సముద్రములో వాన పడినట్లు.
* సముద్రములో వేసిన కాకిరెట్ట వలె.
* సముద్రానికి ఏతాము వేసినట్లు.
* సముద్రానికి లవణదర్శనమన్నట్లు.
* సముద్రాన్ని బయటనుంచే పొగుడుతాము.
* సమ్ముఖానికి రాయబార మేల?
* సరదాకి సమర్తాడితే చాకలిది కోక దొబ్బింది.
* సరసమాడుటెల్ల చావుకు మూలంబు.
* సరసము విరసము కొరకే, పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబు అధిక భాధల కొరకే.
* సరసానికైనా సమయ ముండాలి.
* సరిపడనివారు చచ్చినవారితో సమానం.
* సరివీ, పిల్లలూ లేస్తే సహస్త్రంమంది లేచినట్లు.
* సరువ తప్పేల పోయె, బరువు అలకనాయె.
* సరసమునందు, సమరమునందు సర్వము న్యాయసమ్మతమే.
* సర్వరోగాలకు సారాయి మందు.
* సర్కారుకు చాటుగా ఉండాలి, సావుకారి కెదురుగా ఉండాలి.
* సర్రాజు పెళ్ళిలో గుర్రాజుకో పోచ.
* సర్వజనీనమైన భాష సంగీతము.
* సర్వవిషయములలో మానవుడుగా మనుము.
* సర్వేజనా స్సుఖినోభవంతు అంటే, సర్వేవాళ్ళేనా? మనసంగతేమి? అన్నారట - రెవెన్యూ వాళ్ళు.
* సలిలం కమ్మ లంజలం (సలిలం-కం-లం-జలం) అని, అమరం చదివితే, కమ్మలంజలేం? కాపులంజ లెందుకు కాకూడదు? అన్నాడట.
* సవతాలి కుండనైనా ఉడుకుతానన్నది గాని, తోడికోడలి కుండను ఉడుకనన్నదిట.
* సవతితల్లికి బిడ్డలు పోతేనేమి? సొమ్ముల కాపువానికి బక్కలు (బక్కగొడ్లు) పోతేనేమి?
* సవతికి సంకెళ్ళు, నాకు పిల్లెండ్లు.(పిల్లెండ్లు=ఆభరణాలు, కాలివేళ్ళను పెట్టుకొనేవి).
* సవతి సాగనీయదు, ఏరా లెచ్చనీయదు.
* సవరణ సంతకుపోతే, ఏకులబుట్ట ఎదురుగా పోయిందట.
* సవరదీసినకొద్దీ నిక్కినట్లు.
* సవాసేరులో బోడిపరాచకమా?
* సస్యాధిపతివా? సామ్రాజ్యాధిపతివా?
* సహనముంటే పశ్చాత్తాపానికి చోటులేదు.
**********:: సా ::**********
* సాకు (సాకులు) మేకవుతుంది.
* సాకులు చెప్పినవానికి కాసు, ఇల్లుకప్పిన వానికి దుగ్గాని.
* సాగింది నిజము, సాగనిది దబ్బఱ (కల్ల).
* సాగితే చాపకిందికి ఆరు కుంపట్లు, తొమ్మిది నెగళ్ళు.
* సాగితే నియోగం, సాగకపోతే చచ్చేయోగం.
* సాగితే పాకనాటివారు, సాగకున్న మోటాటివారు.
* సాగితే బండి, సాగకపోతే మొండి.
* సాగితే బొంకు, సాగకపోతే రంకు.
* సాగితే సాగించుకోమన్నారు, జారితే పడమన్నారు.
* సాగినప్పుడు పడుదునా? త్రాగినప్పుడు పడుదునా?
* సాగినమ్మ చాకలితో సరసం ఆడితే తప్పులేదు, సాగనమ్మ సంసారితో మాట్లాడినా తప్పే.
* సాగినమ్మ చాకలివాడితో పోతే అది వ్రతమేమో అనుకున్నారట.
* సాగువాటు చాలనాళ్ళాయె, గొగుకూర తెండమ్మా గోక్కు తిందామన్నదిట.
* సాటీమ్మ సరిగా పెట్టుకుంటే, ఊరి అమ్మ ఉరిపెట్టుకున్నదట.
* సాటివారితో సరిగంగ స్నానాలు చేస్తుంటే, ముసలి మొగుణ్ణి కాస్తా మొసలెత్తుక పోయిందట.
* సాతానికీ, జంగానికీ సయ్యోధ్యత కుదురుతుందా?
* సాతాని గర్భదానం.
* సాతాని జుట్టుకు, సన్యాసి జంధ్యానికి ముడివేసినట్లు.
* సాతాని నుదుట విభూదిరాయడం సురభి బదనిక పాముకు చూపినట్లు.
* సాతుముడికి సత్తువేటు పడితే, సచ్చిన తాతయినా లేచివస్తాడు అన్నట్లు.
* సాదు పలు(ల)వ.
* సాదు రేగితే తల పొలానగాని నిలువదు. (తల పొలము=ఊరి పొలిమేర).
* సాదు రేగినా బూతు రేగినా సవసవ పోవు.
* సాదెద్దు సీదుకు రేగిన కంచెంత పాడు.
* సాధ్వి మహిమ నెట్లు స్వైరిణి ఎరుగురా?
* సానక్రింద దీపము వలె.
* సానక్రింద వెన్నెల వలె.
* సానపై యిరవై, సంచికట్నం ముప్ఫై, ఇంటికి యాభై పంపించండి, కరకర ప్రొద్దెక్కేవఱకు కాటిలో పొగలేపుతాను.
* సానికి ఱంకులు నేర్పాలనా?
* సానిదాని సళ్ళు సంత సొరకాయలు (గోటగిచ్చి ముదురు లేత చూచిపోతారు).
* సాని నీతి - సన్నాసి జాతి (తెలియవు).
* సానులలో సంసారి, సంసారులలో సాని.
* సామజము చెఱకు మేసిన, దోమలు పదివేలు చేరి తోలంగలవా?
* సాము నేర్చినవానికే చావు గండం.
* సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు.
* సాయంకాలం భూపాలరాగం అన్నట్లు (భూపాల=మేలుకొలుపు రాగం).
* సాయబు సంపాదన బీబీ కుట్టిపోగులకే సరి.
* సయబూ! చిక్కిపోయినా వేమంటే? ఇంకా చిక్కుతాం, మరీ చిక్కుతాం, మనసూవస్తే చచ్చిపోతాం మీకేమి? అన్నాడట.
* సాలెకు, జంగానికి సాపత్యం కుదురుతుందా?
* సాలె జాండ్ర సభామధ్యే, సాతానిః పండితోత్తమః
* సాలెవాని భార్య సరిమీద పడ్డది (సరి=గంజి).
* సాలెవాని ఎంగిలి ముప్ఫదిమూడుకోత్ల దేవతలు మెచ్చారట (నాకితేగానీ పడుగు అతకలేడు)
* సాలెవానికి కోతిపిల్ల తగులాట మైనట్లు.
* సాలోడికి కోడిపుంజు తగలాటం.
* సావడి (చావడి) కాలెరా సన్నాసీ, అంటే సా(చా)వసింపు నా సంకలోనె ఉన్న దన్నాడట.
* సావుకారు చతికిలబడితే, పీట వెల్లకిల బడిందట.
* సాహసంలేని వాడికి కత్తి సరిగా తెగదు.
* సాహెబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే.
* సాహెబులా! సెదాములు, సలాము లేవయ్యా? అంటే దొరలు దాతలు పట్టంచు ధోవతు లిచ్చిన ఇనాములేవయ్యా? అన్నాడట.
* సాహెబ్ కు సాడే తీన్. నాకు మూడున్నర.
* సాక్షికాళ్ళు పట్టుకోవడం కన్న, వాదికాళ్ళు పట్టుకోవడం మేలు.
**********:: సి ::**********
* సింగడికేల పత్తి బేరము? (సింగడు=దిశమొలవాడు; బిత్తలి).
* సింగన్నా! అద్దంకి పోయినావా? అంటే, పోనూపోయా, రానూవచ్చా అన్నాడట.
* సింగారం జూడరా బంగారు మొగుడా.
* సింగి కంటే (నీళ్ళాడితే)- సింగడు పథ్యం చేసినట్లు (ఇంగువ తిన్నట్లు).
* సింగినాదం, జీలకఱ్ఱ.
* సింగి నీళ్ళాడితే సింగడు ఇంగువదిన్నట్లు.
* సింహంగూడ చీమకు భయపడే (తలకే) అదును వస్తుంది.
* సింహంలో చీరి ఊడ్చడమున్నూ, కన్యలో కంగా పింగా ఊడ్చడమున్నూ.
* సింహాసనంపై దున్నపోతు, లంజలలో పతివ్రత, ముత్తైదువులలో ముండమోపి.
* సిగ్గంత పోయె చిన్న పెండ్లామా! పెండ్లికన్న పోదాం పెద్ద పెండ్లామా! అన్నాడట.
* సిగ్గు చాటెడు, చెప్పులు మూటెడు.
* సిగ్గు చిన్ననాడే పోయె, పరువు పందిట్లో పోయె, కొరవా సరవా ఉంటే గదిలో పోయె.
* సిగ్గు చెడ్డా బొజ్జ పెడితే చాలును.
* సిగ్గు తోటకూరవంటిది (చాలా సుకుమారము).
* సిగ్గు దప్పిన చుట్టం వన్నెచీర కేడ్చిందట.
* సిగ్గుపడితే సిద్దె కట్టిపడుతుంది.
* సిగ్గుబోవు వేళ చీర లబ్బినట్లు.
* సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకించిందట.
* సిగ్గులేని అత్తకు మోరతోపు అల్లుడు.
* సిగ్గులేని చిన్నాయనా, విడిచిన చిన్నమ్మను ఇంకా కొడుతావా?
* సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం.
* సిగ్గులేని రాత్రికి ఏటా జాగారమే!
* సిగ్గు విడిస్తే రాయలకూడు, తిరుపతికి పోతే బోడితల.
* సిగ్గువిడిస్తే శ్రీరంగము, అంతకూ విడిస్తే బోడితల.
* సిగ్గు సిబ్బిన కొడితే, శరము చేటన కొడుతుంది (శరము=సిగ్గు, షరం)
* సిగ్గూ, శరము లేనమ్మ మొగుడిపెళ్ళికి పేరంటానికి వెళ్ళి, అడ్డగోడ చాటునుండి అర్ధరూపాయి కట్నం ఇచ్చిందట! (చదివించిందట).
* సిగ్గెందుకు లేదురా జగ్గా? అంటే నల్లనివానికి నాకేమి సిగ్గన్నాడట.
* సిగ్గేమే సిగదాకమా అంటే, నాకేమి సిగ్గే తలదారమా అన్నదట.
* సిగ్గే స్త్రీకి సింగారం.
* సిడి పడితే మూన్నెల్ల (మూడేండ్ల) వఱపు.
* సిద్దప్పవంటి శిష్యుడూ లేడు, బ్రహ్మంగారి వంటి గురువూ లేడు, వేమనవంటి యోగీ లేడు.
* సిద్దారెడ్డోరి చద్దన్నం తిని, శివారెడ్డోరి ఆవులు మేపినట్లు.
* సిరికొద్ది చిన్నెలు, మగనికొద్ది వన్నెలు.
* సిరిపంచి కుడువ మేలు.
* సిరిపోయినా చిన్నెలు పోలేదు.
* సిరి రా మోకా లొడ్డినట్లు.
* సిలార్! పిల్లలు, నేను తయార్.
**********:: సీ ::**********
* సీతకు వ్రాసింది సీమకు వ్రాయవలెన?
* సీత పుట్టుక లంక చేటుకే.
* సీతా పతే సిరిచాపే గతి.
* సీతారామాబ్యాం నమః అంటే, మా ఇంటాయన ఎదురుకాలేదా? అన్నదట (భిక్షానికి వచ్చిన వానితొ).
* సీదుకు రేగితే చిచ్చుబుడ్డి, కోపమొస్తే కొరివికట్టె.
* సీలమందలంవరకు చీర కడితేగానీ, సాలెమిందని కెక్కడ తెచ్చియిచ్చేది?
**********:: సు ::**********
* సుంకరమోటుకు మాట నిలకడలేదు.
* సుంకరివద్ద సుఖదుఃఖాలు చెప్పుకొన్నట్లు.
* సుండు చూడనీయదు, మండి మాననీయదు (సుండు= చిన్నకురుపు, మండి=పెద్దపుండు).
* సుకవి తిట్లకు దొరబిడ్డ వెరచు గానీ మోటగాడు వెరచునా?
* సుఖం మరిగినమ్మ మొగుణ్ణి అమ్ముకుని తినిందట.
* సుఖం మరిగిన దాసరి పదం మరచినాడట.
* సుఖమెరుగని బ్రతుకు సున్నమేయని విడెము.
* సుఖవాసి దేహానికి మెత్తని చెప్పు.
* సుఖాలు పువ్వుల వంటివి, అనుభవించగానే అంతరించిపోతవి.
* సుతారం, సూదిలోని దారం.
* సుతులు లేనివారికి గతులు లేవు.
* సుధను గోరువాడు సుడిబడి చచ్చునా?
* సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి.
* సున్నము పుట్టని ఊళ్ళో అన్నము పుట్టునా?
* సున్నాలో ఉన్నది సూఖం, సూఖంలో ఉన్నది మోక్షం.
* సుపుత్రా! కొంప తీయకు (పీకకు)రా అన్నట్లు.
* సుబ్బడిది చుట్టాల రంధి, రాముడిది తామర రంది.
* సుబ్బు పెళ్ళిలో సూరి సమర్త.
* సుబ్బు పెళ్ళి వెంకి చావుకు వచ్చింది.
* సురకు నిచ్చినట్లు, సుధకును నీయరే.
* సురియ బట్టవచ్చు శూరుండు కాలేదు.
* సువాసిని కొప్పుకేకాక బొండుమల్లెలు బోడిముండకేల?
* సువ్వి అంటే తెలియదా? రోకలిపోటు.
* సుళ్ళు చూడమంటే గుద్దలో వేలుబెట్టినాడంట.
**********:: సూ ::**********
* సూతిగల జంత రోటివద్ద మాతు పెట్టెనట.
* సూడిద బూడిద పాలు, యిల్లాలు ఇతరుల పాలు.
* సూత్ర మెఱుగని మైథునశూరులు.
* సూదికి రెండుమొనలు గలవా?
* సూది కుతికె, దయ్య పాకలు.
* సూదికోసం దూలం మోసినట్లు (పరమానందయ్య శిష్యులు).
* సూదికోసం సోదెకు పోతే, పాతఱంకులు బయట పడ్డాయి.
* సూదికోసం సోదెకు వెడితే, కుంచెడు బియ్యం కుక్క ముట్టుకుందట.
* సూది గొంతు, బాన కడుపు.
* సుది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా?
* సూదిబెజ్జంలో ఒంటె దూరవచ్చును గానీ భాగ్యవంతుడు స్వర్గం చేరలేడు
* సూదిబెజ్జం చూచి జల్లెడ వెక్కిరించినట్లు.
* సూదిని మూత గట్టినట్లు.
* సూదిలావచ్చి గడ్డపారలా తేలినట్లు.
* సూదివలే వచ్చి, దబ్బనం మాదిరి తేలినట్లు.
* సూదేటువాణ్ణి, సుత్తేటువాణ్ణి, కండేటువాణ్ణి నమ్మరాదు (కుట్టె జంగం, కంసాలి, సాలి).
* సూరన్న చిన్నవాడు, పేరన్న పెద్దవాడు, అయ్య కెత్తర కోళ్ళగంప.
* సూర్యడు తనోడైతే, చుక్కలన్ని తన కక్కలంట.
* సూర్యుని మొగాన దుమ్ము చల్లితే, ఎవరి కంట బడుతుంది?
* సూర్యుని మొగాన ఉమ్మేస్తే తనమీదనే పడుతుంది.
* సూక్షంలో మోక్షం.
**********:: సె ::**********
* సెంటుభూమి లేని వాని కెందుకు సెంటువాసన లన్నట్లు.
* సెగలేనిదే కూడుండదు.
* సెగలేనిదే పొగ రాదు.
* సెట్టి బ్రతుకు గిట్టినగాని తెలియదు.
* సెట్టి సేరు, బుడ్డ సవాసేరు.
* సెట్టి సింగారించుకొనేలోపల ఊరు కొల్లబోయిందట.
* సెనగల గాదెమీద కుక్క పండుకొన్నట్లు (గాటిలో కుక్క)
* సెంగలు తిని, చెయ్యి కడుకున్నట్లు.
* సెభాష్ మద్దెలగాడా! అంటే, ఐదువేళ్ళు పగలగొట్టు కున్నాడట.
**********:: సే ::**********
* సేరుకాయ నీటాయె, ఉల్లెం గడ్డ మోటాయె.
* సేరుకు సవాసేరు (వడ్డించినాడన్నట్లు) అన్నట్లు.
* సేరు దొరకు మణుగు బంటు.
* సేవకునిలాగా చెయ్యాలి, రాజులాగా అనుభవించాలి.
**********:: సై ::**********
* సైంధవుడు అడ్డు పడినట్లు.
* సై అనే కలువాయి, అవిశలగల యిల్లు జూపే కలువాయి, బిళ్ళకుడుము మాదిరి రూపాయి తట్టేసి బిగిసికునే కలువాయి. (కలువాయి గ్రామంలో ఱంకుటాలు చేసిన మోసము గురించి).
* సైదాపురం రాచ్చిప్ప (రాతిచిప్పవలె మొద్దు అనుట)
* సైవలేని వాడు నెయ్యి నాకినట్లు.
* సైరా మాలోడా అంటే, పరమెత్తి పైన వేసుకున్నాడట (సై అను=ఉబ్బించు; పరము=బండిపై చట్టములో ఇరుప్రక్కల ఉండే పొడుగు నిలువు కొయ్యలు).
**********:: సొ ::**********
* సొంతానికి ఏనుగు, ఉమ్మడికి పీనుగు.
* సొంతానికి పిడుగు, ఉమ్మడికి బడుగు.
* సొగసుగానికి (షోగ్గానికి) మూడుచోట్ల అంతు.
* సొగసు సోమవారం పోతే, మొగుడు ఆయవారం పోయాడట.
* సొగసైన బూరుగను పెంచితే సురస ఫలముల నిచ్చునా?
* సొగసైన లేమకు సెగరోగ మున్నట్లు.
* సొమ్ము ఒకచోట, అపనమ్మిక ఇంకొకచోట.
* సొమ్ము ఒకదిది సోకు ఇంకొడిది.
* సొమ్మొకడిది, సోకొకడిది.
* సొమ్ము పోగా దిమ్ము పట్టినట్లు.
* సొమ్ము పోయేటప్పుడు, తట్టు తగిలేటప్పుడు మతి ఉండదు.
* సొమ్ము సొమ్ములోనే ఉండె, సోమయ్య మందిలోనే ఉండె.
**********:: సో ::**********
* సోదించడ మెందుకు. సొడు పెట్టడమెందుకు?
* సోమరితనం, చిగిర్చని పూయని కాయని చెట్టువంటిది.
* సోమర్లకు స్వయంపాకం చేసిపెట్టి, పందులకు పక్క వేసినట్లు.
* సోమరికి షోకు లెక్కువ.
* సోమిదమ్మ సొగసుకాంద్ర కోరితే, సోమయాజి స్వర్గార్హు డగునా?
* సోయిదప్పిన వాడా? సొంగ ఎక్కడ పెట్టినావురా? అంటే, త్రాగి తమ్మళ్ళ బాలమ్మ గుడిసెకు చెక్కినా నన్నాడట.
**********:: సౌ ::**********
* సౌందర్యమే శాశ్వతానందం.
**********:: స్త ::**********
* స్తంభం చాటున ఏంది? అంటే, కుంభ మన్నారట! అయితే నాకేనా మూడు మెతుకులు?
* స్తంభం చాటుగాడు ఒకడు, అదే పోతగాడు ఇంకొకడు, పోతే రానివాడు మరియొకడు.
* స్తనశల్య పరిక్ష చేసినట్లు.
**********:: స్త్రీ ::**********
* స్త్రీలనేర్పు మగల చీకాకు పరచురా!
**********:: స్థా ::**********
* స్థాన బలిమి కానీ తన బలిమి కాదు.
**********:: స్థి ::**********
* స్థిరాస్తి ఆయన, చరాస్థి ఆయన గుడ్డలు.
**********:: స్థూ ::**********
* స్థూలం కనుగుడ్డు, సూక్షం కనుపాప.
**********:: స్నా ::**********
* స్నానానికి ముందు, సంభావనకు వెనుక కూడదు.
* స్నానాలు లేని బ్రాహ్మలకు శాపాలు లేవు.
**********:: స్నే ::**********
* స్నేహితునకు అప్పు ఇస్తే రెండూ పోతవి.
**********:: స్వ ::**********
* స్వకుచమర్ధనం (తన్ను తాను పొగడుకొనుట)
* స్వకుచమర్ధనంవల్ల రంభకైనా సుఖంలేదు.
* స్వధనంబులకై బండపంచాంగమేల? (బండపంచాంగం=రచ్చబండ దగ్గర చెప్పే పంచాంగం).
* స్వయం రాజా, స్వయం మంత్రి, స్వయం చాకలి, స్వయం మంగలి.
* స్వర్గానికి పోతూ, చంకన ఏకులరాట్నం ఎందుకు?
* స్వర్గానికి పోయినా విడాకులు తప్పలేదట.
* స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పిందికాదు అన్నట్లు.
**********:: స్వా ::**********
* స్వాతంత్ర్యం స్వర్గం, పరతంత్ర్యం ప్రాణసంకటం
* స్వాతి కురిస్తే చట్రాయిగూడా పండును.
* స్వాతి కురిస్తే, చల్ల పిడతలోకిరావు - జొన్నలు.
* స్వాతి కురిస్తే భీతి కలుగుతుంది.
* స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
* స్వాతికొంగ, పంతకాపు, నీళ్ళున్నచోటే ఉంటారు.
* స్వాతికొంగల మీదికి సాళువం పోయినట్లు.
* స్వాతి వర్షం చేనుకు హర్షం.
* స్వాతివానకు సముద్రాలు నిండును.
* స్వాతివాన ముత్యపు చిప్పకుగానీ నత్తగుల్ల కేల?
* స్వాతివిత్తనం, స్వాతి కోపులు (కోపు=సరియైన అదను, నివదల్ల ఏర్పడే ఏపు).
* స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
* స్వాతీ! నేను జవురు కొస్తాను, విశాఖా! నీవు విసురుకురా.
* స్వామికార్యం, స్వకార్యం కలిసి వచ్చినట్లు.
