తమాషా ప్రశ్నలు -8
1. పొలం దున్నని పోతు ?
జెర్రిపోతు
2. తాగకపోయినా వచ్చే మత్తు ?
గమ్మత్తు
3. నీరులేని చెరువు ?
అచ్చెరువు
4. పరుసులో పెట్టుకోలేని ధనం ?
సాధనం
5. అవయవాలు లేని దేహం
సందేహం
6. తెల్లకార్డు పై ఇవ్వని రేషన్ ?
ప్రిపరేషన్
7. సుఖం లేని రెస్ట్
అరెస్ట్
8. అందరూ భయపడే గోళం
గందర గోళం
9. నొప్పి పెట్టే కాయ ?
మొట్టికాయ
10. చెరువులో ఉండే కాయ
ఎండ్రకాయ
11. మనుషులు తిప్పలేని చక్రం ?
కాలచక్రం
12. మనుషులు నడవని దారులు ?
దోపిడీదారులు
13. నొప్పి పెట్టని వాత ?
తరువాత
14. పెద్దవారిని కూర్చోమని చెప్పలేని కుర్చీ?
గోడకుర్చీ
15. చూసి ఆనందించే విందు ?
కనువిందు
16. ఇస్టం లేని నామాలు ?
రాజీ నామాలు
17. గణితం లో లేని సూత్రం ?
మంగళ సూత్రం
18. చూసి ఆనందించే ఫలాలు ?
దినఫలాలు
19. కర్రలు లేక పోయినా మండే మంట ?
కడుపు మంట
20. కనబడని పటం
కపటం
