తమాషా ప్రశ్నలు -2

bookmark

1. భక్తులులేనిదేవుడు?
సహదేవుడు

2. ప్రయాణీకులులేనిమెయిల్?
బ్లాక్ మెయిల్

3. పెద్దలకు పెట్టలేని పిండాలు?
మూత్రపిండాలు

4. భక్తులులేనిసాయిఎవరు?
కసాయి

5. వ్యవసాయం చెయ్యని ఫార్మర్ ?
ఇన్ ఫార్మర్

6. దంపతులుతో పూజ చేయించేది?
పంతులు

7. ఎగురవేయలేని జెండా?
అజెండా

8. మోగని గంటలు?
జడగంటలు

9. అవసరం లో ఆడవారి వస్తువు?
సవరం

10. కనబడని జనం ఎక్కడ ఉన్నారు?
భోజనం

11. విలువ కట్టలేని హారం ?
పరిహారం

12. విసరలేని రాయి ?
పరాయి

12. మనిషిని చూసి చెప్పే రుచి ?
అభిరుచి

13. డబ్బా కు పెట్టలేని మూత?
కన్నుమూత

14. అనసూయ లో ఎవరికీ ఉండకూడనిది ?
అసూయ

15. పరసులో పెట్టుకోలేని ధనం?
ఇంధనం

16. షరాబు చెయ్యని నగ?
సెనగ

17. గుడిలో చెయ్యని భజన?
విభజన

18. ధరించలేని నగ?
మునగ

19. శ్రీరామునికి సాయం చెయ్యని వాలి ?
రావాలి

20. దేవుడు ఇవ్వని వరం ?
సురవరం

21. పంచాంగంలోలేని తిధి ?
అతిధి

22. బీహారులో కొందరు తాగేది ?
బీరు

23. విషయంలో హానికలిగించేది ?
విషం

24. కదలకుండా ఎగిరేది ?
జెండా

25. వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది?
చలివేంద్రం

26. తవ్వితేగాని కనబడని నిజం ఏది?
ఖనిజం

27. తినలేని జాం ఏది?
ట్రాఫిక్ జాం

28. చూడండి లేరు అని చెప్పే ఊరు ఏది?
సీలేరు

29. టంగుటూరు లో ఉన్న ఇంకో ఊరేది?
గుంటూరు

30. కరివేపాకులో ఉన్న ఇంకొ ఆకు ఏది?
వేపాకు