తమాషా ప్రశ్నలు -18

bookmark

1. వాయించలేని డోలు?
భీమడోలు

2. పేరు లో పది ఉన్నది ఎవరు?
ద్రౌపది

3. నల్లపు రెడ్ది లో ఉన్న రుచి ఏది?
పుల్లన

4. రోశయ్య లో పడక?
శయ్య

5. రైతులు ఇష్టపడే బడి?
దిగుబడి

6. అందరూ భయ పడే బడి?
చేత బడి

7. వ్యా పా ర స్తులు ఇష్ట పడే బడి ?
రాబడి

8. యుధ్ధానికి పనికిరాని డాలు?
అప్పడాలు

9. పేరులొ నీరున్న వారు?
ఇంజనీరు

10. దాహం తీర్చని నీరు?
కన్నీరు

11. అభినేత్రి లో మహాముని?
అత్రి

12. ప్రజలు లేని పురం?
గోపురం

13. అవసరం లో స్త్రీ ల అందం పెంచేది ?
సవరం

14. చొక్కాకు లేని జేబు?
ఔరంగజేబు

15. తియ్యగాలేని పాకం?
కానిపాకం

16. జబ్బు లుకు పనిచెయ్యని మందు ?
నీలిమందు

17. తినే డాలు ఏది ?
అప్పడాలు

18. దండ గుచ్చలేని పూస?
వెన్న పూస

19. ఎప్పుడూ మరని తరం?
వందేమాతరం

20. కుర్రాడి లో ఎదమ కాదు?
కుడి