తప్పులెన్నువారు తండోప తండంబు

bookmark

తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము :
ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు చిన్న తప్పయినా చేస్తారు. అందులో చాలామంది ఇతరుల తప్పులను పట్టేవారు ముందుకు వస్తారు. కానీ లోకంలో వున్న ప్రజలందరు సులభంగా చేసే తప్పులను మాత్రం తమకుతాము గ్రహించలేరు.