చెప్పులోని ఱాయి, చెవిలోని జోరీగ
చెప్పులోని ఱాయి, చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు, కాలిముల్లు,
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
మనం నడుస్తున్నప్పుడు చెప్పులోకి చిన్న రాయి వచ్చి చేరినప్పుడు, చెవిలో జోరీగ (పురుగు) దూరిననూ, కంటిలో నలుసు పడిననూ అప్పుడు మనం పడే బాధ సామాన్యంగా ఉండదు. అలాగే మన ఇంటిలో ఇల్లాలు జగడమూ పెట్టినా అంతే బాధ ఉంటుందనేది దీని భావం. అందుకే పెద్దలు ఏ బాధ అయినా తట్టుకోవచ్చును గానీ ఇల్లాలి పోరు మాత్రం తట్టుకోలమని చెబుతారు.
