చంపదగిన యట్టి శత్రువు తనచేత
చంపదగిన యట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము :
మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని ఎటువంటి కీడు చేయకూడదు. అవసరమైతే తగినంత మేలు, మంచిమాటలు, గౌరవమర్యాదలు చేసి పొమ్మనడమే ఎంతో మేలు. (మనిషిలో మార్పును రాబట్టడానికే వేమనగారు ఈ పద్యాన్ని రచించారు) .
