కాదు సుమీ దుస్సంగతి
కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
తాత్పర్యం:
చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.
