ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము :
ఎలుకతోలును ఎన్నిసార్లు ఉతికి, కడిగినా దానికున్న సహజసిద్ధమయిన నలుపు రంగే వుంటుందే తప్ప.. తెలుపు రంగుగా మారదు. అదేవిధంగా చెక్కబొమ్మను తెచ్చుకుని ఎన్నిసార్లు కొట్టినా అది మాట్లాడదు, చలించదు. (ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సహజసిద్ధంగా వున్న వస్తువులను, విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాటిని మార్చలేము).
