ఈ గాలీ.. ఈ నేలా..
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు.. సెలయేరు.. ||2||
నను గన్న నా వాళ్ళూ ఆ... నా కళ్ళ లోగిళ్ళూ||2||
ఈ గాలీ.. ఈ నేలా...
చిన్నారి గొరవంక కూసేను ఆవంక ||2||
నారాక తెలిసాక వచ్చేను నావంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగిసేను నింగిదాక ||2||
ఎగసేను నింగి దాకా...
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు.. సెలయేరు.. ||2||
నను గన్న నా వాళ్ళూ ఆ... నా కళ్ళ లోగిళ్ళూ||2||
ఈ గాలి.. ఈ నేల...
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు ||2||
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధను ||2||
ఈ రాళ్ళే జవరాలై ఇట నాట్యాలాడేను ||2||