ఈశ్వరుడు
లోకమ్ము వారికీ రొండు కన్నుల్లు;
లోకరక్షక, నీకు వేయికన్నుల్లు!
ఇద్దరుపెండ్లాలు, ఈశ్వరుడ నీకు;
పలువరుస చక్కనిది పార్వతీదేవి!
కన్నుల్లు చక్కన్న కనకదుర్గకును,
ఇద్దరుపెండ్లాము లేలయ్య నీకు?
ఎద్దెక్కి తిరిగేవు ఈశ్వరుడ నీవు,
బిచ్చమెత్తిందాక బిడ్డలకు లేదు!
అడిగి తెచ్చిందాక ఆలికే లేదు!!
