సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు కదలకుండ కొమ్మ వంచండి
పట్టి పూలు కోసుకొచ్చి బుట్ట నింపండి
అందులో పెద్ద పూలు దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకివ్వండి
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటే దోచుకుంటారు
దొడ్డి గుమ్మం లోన దొంగలున్నారు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
