రామ చిలక్క ఇల్లెక్కడ

bookmark

రామ చిలుక ఇల్లెక్కడ?
చెట్టు తొర్రలో నా ఇల్లు
పిచుక పిల్ల ఇల్లెక్కడ?
వేలాడే గూడే నా ఇల్లు
కాకమ్మ కాకమ్మ ఇల్లెక్కడ?
ఎత్తైన చెట్టుపై నా ఇల్లు
నాగరాజ ఇల్లెక్కడ?
చీమల పుట్టే నా ఇల్లు
సింహం మామ ఇల్లెక్కడ?
కొండ గుహలే నా ఇల్లు
నత్త గుల్లమ్మ ఇల్లెక్కడ?
నాతో ఉందిలే నా ఇల్లు