మాటలాడు నొకటి మనసులోన నొకటి
మాటలాడు నొకటి మనసులోన నొకటి
ఒడలి గుణము వేరె యోచన వేరె
ఎట్లుగల్లు ముక్తి యీలగు తానుండ
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
తాను పైకి మాటలాడున దొకటి . మనస్సులో నున్నదింకొకటి. . తన గుణమొకటి, , యోచన వేరొకటి . ఇట్టి వారికి మోక్షము ఎట్లా కలుగును. . అందుకే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సూటిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడ వలెను. అలాగే ప్రార్థించే టప్పుడు మనస్సులో మరో ఆలోచన పెట్టుకొని ప్రార్థించ కూడదు. . మనం ఏది కోరుకోవాలను కున్నామో అదే ఆలోచనతో ఉండాలి.
