పొద్దున్నే మనము లేవాలి
పొద్దున్నే మనం లేవాలి
పళ్ళను బాగా తోమాలి
గ్లాసెడు పాలు తాగాలి
స్నానం చక్కగా చేయాలి
తలను నున్నగా దువ్వాలి
చక చక బడికి వెళ్ళాలి
గురువుకు దండం పెట్టాలి
చదువులు బాగా చదవాలి
అమ్మ నాన్న మెచ్చాలి
అమ్మ నాన్న మెచ్చాలి
