పనిచేయునెడల దాసియు
పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తి యెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!
తాత్పర్యం:
భార్య... ఇంటిపనుల్లో దాసిగా, సంభోగ సమయంలో రంభగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిగా, భోజనం పెట్టే సమయంలో తల్లిగా ప్రవర్తించేలా ఉండాలి.
