తెలుగు సూక్తులు - 4

bookmark

1. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.

2. ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.

3. ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.

4. ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.

5. ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.

6. ఎవరి పని వారుచేసుకోవడం ఉత్తమ ధర్మం.

7. ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.

8. ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.

9. ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.

10. ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.

11. ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

12. ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.

13. ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.

14. ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.

15. ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.

16. ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.

17. ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.

18. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.

19. ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.

20. ఒక కోపిష్టి మనిషి తన నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.

21. ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.

22. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.

23. ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.

24. ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి.

25. ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.

26. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.

27. ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం.

28. ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.

29. ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.

30. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.

31. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.

32. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.

33. ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.

34. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.

35. ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.

36. ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.

37. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.

38. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

39. ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది.

40. ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.

41. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది.

42. ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.

43. ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.

44. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

45. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.

46. ఓర్పుకు మించిన తపస్సు లేదు.

47. కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.

48. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.

49. కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు.

50. కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.