తెలుగు సూక్తులు - 24

bookmark

1. యోగము ఉన్నవాడు యోగి కాక తప్పదు!

2. యోగమంటే ఉప’యోగము’ పడేది!

3. సాధనకు ఉపయోగపడేది యోగమే!

4. సాధన సాధ్యతే సర్వం సాధ్యం !

5. విగ్రహరాధన కన్నా విశ్వారాధన మిన్న!

6. విశ్వారాధన అంటే పక్షులకి మేత...మొక్కలకి నీళ్ళు...పశువులకి గ్రాసం..మనిషికి సహయం!

7. శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న !

8. ఓంకారం కన్నా తుంకారం మిన్న !

9. అహంకారానికి విరుగుడు ఓంకారం!

10. బ్రహ్మతదాకార సాధన స్థితి అన్నిటికన్నా మిన్న !

11. బ్రహ్మ రంద్రం వద్ద చితాగ్ని జ్యొతి దర్శనమే అంతిమ సాధన!

12. పరమ శూన్య అనుభవ అనుభూతియే అంతిమ సాధన స్థితి!

13. హృదయ చక్రం వద్దే అంతిమ సాధన పరిసమాప్తి!

14. ఎరుక అయితే మాయ మాయం అవుతుంది!

15. పదార్థం దాటితే యదార్ధం తెలుస్తుంది!

16. అన్ని లింగాల ఆరాధన కన్నా ఇష్టలింగ ఆరాధన మిన్న !

17. అన్ని ధ్యానాలలో కల్లా ఆత్మ ధ్యానమే మిన్న !

18. నేను ఆత్మ అని తెలుసుకొనుట జ్ఞానప్రాప్తి!

19. నేను ఆత్మ అని మరచుట మోక్ష ప్రాప్తి !

20. మాధవుడిని మానవుడి గా చూడటం భక్తి మార్గం!

21. మానవుడిలో మాధవుడిని చూడటం జ్ఞాన మార్గం!

22. నరుడు నారాయణుడు ఒకటే గా చూడటం ధ్యాన మార్గం!

23. మానవసేవే మాధవ సేవ కర్మ మార్గం !

24. అన్ని కోరికలు కన్నా ఇష్ట కోరిక మిన్న!

25. అన్ని ఆరాధన కెల్లా విశ్వ ఆరాధన మిన్న !

26. అన్ని గురువుల్లో కెల్లా నీ ఆత్మ గురువు మిన్న !

27. అన్ని భక్తుల్లో కెల్లా ఆత్మ నివేదన భక్తి మిన్న !

28. అన్ని కర్మల్లో కెల్లా నిష్కామ కర్మ మిన్న!

29. శివం - శవం ఒకటే అనేది నిజమైన స్మశాన వైరాగ్యం!

30. నరుడు కాస్త వానరుడు అవ్వడం మాయ జయం!

31. జీవుడు కాస్త శివుడు అవ్వడం సాధన అంతిమ జయం!

32. విచారానికి విరుగుడు వైరాగ్యం !

33. కష్టాలలో కెల్లా మిక్కిలి కష్టం ఆకలి బాధ !

34. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న!

35. జ్ఞానం వస్తే పోదు - అజ్ఞానం పోతే రాదు!

36. భగవంతుడు బలహీనత లేని వాడిని ఇంతవరకు సృష్టించలేదు!

37. మూల కపాల మోక్ష ప్రాప్తి అంతిమ సాధన లక్ష్యం!

38. అన్ని ప్రశ్నలు కెల్లా “నేనెవర్ని” అనే ప్రశ్న అనేది మిన్న!

39. ధ్యానమే శ్వాసగా ఉండాలి!

40. శ్వాస మీద ధ్యాస ఉండాలి!

41. మనసు పరిశుద్ధంగా ఉంటే నువ్వే సత్యము!

42. మనసు మాయ లో ఉంటే నువ్వే అసత్యము!

43. కనిపించేది అసత్యము…. కనిపించనిది సత్యము !

44. నేను అనేది ఎవరు తెలుసుకోవటమే నిజమైన యోగ సాధన!

45. ఎరుక ఎరుక అవ్వటమే నిజమైన మోక్ష జ్ఞానప్రాప్తి!

46. ఉన్న స్ధితి నుండి ఉన్నత స్ధితికి చేరడమే యోగసాధకుడి లక్ష్యము!

47. ఏది అశ్వాతమో..అదియే దు:ఖము!

48. ఇష్టకోరికయే సకల దు:ఖానికి మూలము!

49. కాశి క్షేత్రానికి చచ్చిన వాళ్ళు (పిండాల వాళ్ళు) అలాగే చచ్చేవాళ్ళు (వృద్దులు) వస్తారు!

50. అశాంతి నుండి ఆత్మశాంతి పొందడమే సంపూర్ణ సాధన పరిసమాప్తి!

51. గ్రహశాంతి అంటే మన:శాంతి ఇచ్చేది!

52. పోయేది ఏమి లేదు! వచ్చేది ఏమి లేదు!

53. మనకి వచ్చేవి మూడు - 1. పేదరికం 2. వ్యాధి 3. డబ్బు!

54. మనకి వచ్చిన వదిలిపోనివి మూడు - 1. కీర్తి 2. విద్య 3. జ్ఞానం!

55. మన నుండి పోతే తిరిగి రానివి మూడు 1. కాలం 2. వయస్సు 3. అజ్ఞానం!

56. మనము పోతే వెంట వచ్చేవి మూడు 1. పాపం 2. పుణ్యం 3. జ్ఞానం!

57. ఏదో చేయాలి..ఏదో తెలుసుకోవాలి...ఏదొ పొందాలి అనుకోవడమే మహ మాయ సహితం!

58. ఏమి చెయ్యకుండా ప్రశాంతమైన నిశ్చిలస్ధితి పొందడమే మహ మాయ రహితం!

59. (అ )- అహం నుండి (ఆ) - ఆత్మ వరకు ….(ఇ)- ఇహం నుండి (ఈ)- ఈశ్వరుడు వరకు ఎవరు చేరుకుంటారో వారికి జన్మ లేదు!

60. ఈ విశ్వమంతా ఎపుడో...ఎల్లపుడు పరిపూర్ణమే... ఎక్కడగూడ .. ఇసుమంత.. రేణువంతా.. గూడ అసంపూర్ణమే లేదు!

61. జ్ఞానం పొందిన వాడు చెప్పడు - పొందనివాడు ఎన్నటికీ తెలుసుకోలేడు!

62. ఆవేశం వస్తే ఆపలేము! ఆనందం వస్తే అదుపులో ఉండలేము!

63. సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే…. అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది!

64. తినటానికి భోజనం లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి చేరటమే భోగ జీవితం !

65. డబ్బులు చేతిలో ఉంటే నువ్వు ఎవరో మర్చిపోతావు …. డబ్బులు చేతిలో లేకపోతే నువ్వు ఎవరు విషయం ప్రపంచం మర్చిపోతుంది!

66. రూపాన్ని చూసి మోసపోకు… రూపాయిని చూసి మురిసిపోకు !

67. అవసరాల కొత్త దారులు వెతికితే… అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయి!

68. నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో సుఖంగా ఉండలేవు!

69. మరిచిపోలేని వారిని క్షమిస్తే… క్షమించలేని వారిని మరిచిపోతే… అదియే మనశ్శాంతికి నాంది !

70. దేవుడు అనేది నమ్మకం…. అది మనకి కావాల్సిన శక్తిని ఇస్తుంది!

71. ఓటమి లేనివాడికి అనుభవం రాదు…. అనుభవం లేని వాడికి జ్ఞానము రాదు!

72. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది …. జ్ఞానము ప్రక్కనే అజ్ఞానము లాగా !

73. ఎంత చేసిన కూటికే…. ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే…!

74. ప్రతి మనిషి లోను బలహీనత…. సానుభూతి కోసం ఎదురుచూడటం !

75. జీవితం ఒక ప్రశ్న ఎవరూ సమాధానం చెప్పలేరు… చావు అనేది దీనికి సమాధానం …కానీ ఎవరికీ దీనిని ప్రశ్నించే ధైర్యం ఉండదు!

76. ఎదుటి వాడికి లాగా బతకాలని అనుకోవడమే అశాంతికి నాంది!

77. మీరు ఎంచుకున్న దైవము… గురువు… మంత్రము… స్థాయిని బట్టి మీ సాధన స్థాయి చేరుకుంటుంది!

78. సాధన పరిసమాప్తి అవ్వాలంటే నీ మనసే మీకు దైవం అవ్వాలి !

79. సాధన పరిసమాప్తి అవ్వాలంటే నీ ఆత్మ మీ ఆత్మ గురువు అవ్వాలి!

80. సాధన పరిసమాప్తి అవ్వాలంటే ఈ జ్ఞానమే ఆత్మ జ్ఞానం అవ్వాలి !

81. నేను అనే జ్ఞానం కలిగి ఉండటమే మహామాయ!

82. తాడు కాస్తా పాము గా కనబడితే అది భ్రమ!

83. తాడు కాస్తా పాము గా అనిపిస్తే అది మాయ !

84. దానాలు చేయండి… దానాలు తీసుకోకండి!

85. సేవలు చేయండి … ఉచితంగా సేవలు పొందకండి!

86. కర్మలు చెయ్యండి…. ఫలితాలు ఆశించకండి!

87. ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేయండి!

88. నేను అనేది త్యాగము చేస్తేనే… నువ్వు ఎవరో నువ్వు ఎవరో తెలుస్తుంది!

89. నేను కుట్టగానే చనిపోవాలి అనుకోవడం చీమ అవివేకం!

90. నేను కుట్టగానే ఎదుటివాడు చనిపోవాలి అనుకోవటం పాము వివేకం!

91. నేను చేయగలను అనుకోవటం ఆత్మవిశ్వాసం!

92. నేను మాత్రమే చేయగలను అనుకోవటం అహంకారం !

93. అహం పెరిగితే అవమానం పెరుగుతుంది!

94. అహం తగ్గాలి అంటే శరణాగతి అవసరము!

95. నేనెవర్ని అనుకోవడం చేయరాదు…. ప్రశ్నించుకోవడం చేయాలి …దానికి తగ్గట్లుగా ఆత్మ విచారణ చేసుకోవాలి!

96. మనం అడ్డ కళ్ళతో చూస్తున్నాము… కాబట్టి ఈ లోకం అడ్డగోలుగా కనపడుతుంది!

97. నిలువు కళ్ళతో (త్రినేత్రము) చూస్తే ఈ విశ్వం అంతా సవ్యంగా కనబడుతుంది!

98. నేను అనే స్ఫురణ ఎక్కడ కలుగుతుందో అక్కడ నిశ్చల అయితే యోగ సాధన పరిసమాప్తి !

99. నేను అనే స్ఫురణ మనకి హృదయ కమలంలో జరుగుతుంది!

100. నిన్నటి జ్ఞాపకాలు మర్చిపోవాలి…. రేపటి గురించి మర్చిపోవాలి… ప్రస్తుత క్షణాలే మోక్ష క్షణాలు!

101. తనకి ఏది ఉందో దానితో సంతృప్తి పడే వాడే నిజమైన వైరాగి !

102. మనసు ఉంటే మనుగడ ఉంటుంది !

103. వైరాగ్యమంటే సంతృప్తి ఉండటమే!

104. పరిస్థితులకు సిద్ధ పడటానికి జ్యోతిషశాస్త్రం ఉపయోగపడుతుంది!

105. రూపం లేని మనసు రూపం ఉన్న వస్తువుల మీద ఆశ పడటం మాయ!

106. కారణము లేనిదే కార్యం జరగదు!

107. మనసు మన వశములో ఉంటే మనోజయం కలుగుతుంది!

108. మనం దేని గురించి ఆలోచిస్తే …. మన సాధన అదే అనుభవంగా చూపిస్తుంది!

109. మనం దేని గురించి భావన చేస్తూ ఉంటే… మన సాధన అదే అనుభూతిగా ఇస్తుంది!

110. సాధనలో దైవ, ఆత్మ దర్శనం అనుభవాలు మనో భ్రాంతి అని తెలుసుకుంటే మాయ మాయమవుతుంది!

111. జీవితంలో కలవడం…. విడిపోవడం అనేది జీవితం జీవిత విధి!

112. జరిగేది ఎలాగైనా దొరుకుతుంది… జరగనిది ఎన్నటికీ జరగదు!

113. మౌనంగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరం!

114. మృత్యువంటే భయం ఉంటుంది… మృత్యువు దాటితే భయము ఉండదు!

115. నాకు కావాలని సంకల్పం ఉంటే ప్రకృతి లేదా విశ్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది!

116.. వస్తువులను ప్రేమించటం మాని… మనుషులను వాడుకోవడం మానిని.. వారికి ఆత్మ శాంతి కలుగుతుంది!

117. నాకు ఇక ఏమి వద్దని అనుకొని… తృప్తి పడి… వద్దు అనుకుంటే…. ఏమీ రావు… ఏమీ ఉండవు!

118. భక్తి ,జ్ఞాన, వైరాగ్య భావాలు ఉన్నవారికి విశ్వమే దాసోహం అవుతుంది!

119. ఏదైనా తప్పుగా అన్నిపిస్తే... అది ఎన్నడికి చేయవద్దు!

120. ఏమి చెప్పాలని అనుకున్న సూటిగా చెప్పేయండి!

121. మీ కల లేదా లక్ష్యము ఏదైనా సాధించేవరకు వదలవద్దు!

122. మీపై మీరు నమ్మకమును ఎట్టి పరిస్ధితులలో కోల్పోకూడదు!

123. మీలో ఉన్న నైపుణ్యమును పూర్తిగా నమ్మండి!

124.“లేదు/కాదు” అని చెప్పేందుకు మొహమాటపడవద్దు!

125. “అవును” అని చెప్పేటానికి భయపడవద్దు!

126. మీ గూర్చి మీరు తక్కువ చేసుకుని మాట్లడకోవద్దు!

127. మీ చేతిలో లేనిదానిని అలా వదిలెయ్యండి!


ఒకసారి అర్జునుడు శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు

ఈ గోడపైన ఒక సందేశము వ్రాయి! అది ఏలా ఉండాలంటే

అది సంతోషంగా ఉన్నపుడు చదివితే దు:ఖము రావాలి!

అదే దు:ఖముగా ఉన్నపుడు చదివితే సంతోషం రావాలి!

శ్రీ కృష్ణుడి ఇలా వ్రాశాడు

"ఈ సమయం వెళ్ళిపోతుంది "