తెలుగు సూక్తులు - 21

bookmark

51. దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్ధ్యాలను నశింపచేస్తుంది. ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని నశింప చేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు...!!

52. అగ్నిని పొగ ఆవరించినట్లు,
అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,
గర్భస్త శిశువుని మావి కప్పినట్లు,
జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.

53. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు
ఉద్ధరించుకొనుము, అంతేకానీ పతనమైపోవద్దు.
ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.

54. జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు
పతనమైపోతారు. విశ్వాసము లేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు.

55. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి
భగవద్గీతను మించిన ఆయుధం లేదు.

56. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడము, లేకపోవడం, భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి.

57. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి.. వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ..
ఏ ఒక్కరికి తమలో ఉండే "గర్వం" తెలుసుకునే తెలివి ఉండదు.

58. జీవితంలో వయసు ఉన్నపుడే భగవద్గీతను చదవండి! ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా.. ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి!

59. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

60. నువ్వు కోరితే కోరినదే ఇస్తాను,
కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను.

61. నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో...
ఫలితాన్ని మాత్రం నాకు వదిలి పెట్టు!!

62.
నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపుణిత సీత
నా దేశం కరుణాతరంగా
నా దేశం సంస్కార గంగ.