తెలుగు సూక్తులు - 17

bookmark

11. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నించండి. నేర్చుకునే వాటితో తృప్తి చెందకండి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే, అక్కడ నుంచి మీరు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకోండి. జీవితంలో మార్పు సహజం.

12. జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు.

13. మీకు మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోండి. ఇతరులకు చెప్పేముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. అత్మ ప్రబోధానికి మించింది లేదు.

14. కొద్ది మొత్తంలో ఒత్తిడి మంచి జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది.

15. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే. ఎవరు శాశ్వతము కాదు, కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది శాశ్వతమైనది.

16. కోపమే అన్ని అనర్ధాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి. మిగిలిన రెండు మోహము, ఆశ. కోపము లో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు, అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు.

17. కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి.

18. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు.

19 ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు.

20. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు.