తెలుగు సూక్తులు - 14

bookmark

1. రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.

2. రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.

3. రోజుకు 5 ముఖ్యమైన పనులు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి.

4. రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.

5. లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి.

6. లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి! - స్వామి వివేకానంద.

7. లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.

8. లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.

9. లోభికి నాలుగు దిక్కులా నష్టం.

10. వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.

11. వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేమ్స్ రసెల్ లోవెల్.

12. వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.

13. వయసు వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.

14. వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.

15. వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.

16. వస్తువ విలువ అవసరాన్ని బట్టితెలుస్తుంది.

17. వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.

18. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.

19. వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.

20. వాత్సల్యం బుద్దిని మందగిస్తుంది.

21. వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.

22. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.

23. వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది.

24. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.

25. విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.

26. విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.

27. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.

28. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచి పెట్టేవాడు ఎన్నడూ జయించడు.

29. విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.

30. విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.

31. విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.

32. విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.

33. విద్య యొక్క నిజమైన పరమార్ధం ఉత్తమ వ్యక్తిని రూపొందింప చేయడమే.

34. విద్య లేని వారికి కీర్తి లేదు.

35. విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరుయు ప్రతి కూలతలో ఒక అభయస్ధానం.

36. విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం

37. విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.

38. విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.

39. విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.

40. వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.

41. వినయం నీవు ధరించే విలువైన వజ్రం.

42. వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.

43. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.

44. విరగడం కంటే వంగడం మంచిది.

45. వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.

46. వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.

47. వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.

48. వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.

49. విశ్వాసం పరమ బంధువు.

50. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.