తెలుగు సూక్తులు - 11
1. ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.
2. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.
3. ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.
4. ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది కానీ ద్వేషం చేయలేదు - బుద్ద.
5. బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.
6. బందిపోటు దొంగలకంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది.
7. బలమే జీవనం, బలహీనతే మరణం.
8. బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు.
9. బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.
10. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
11. బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది.
12. బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది.
13. బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.
14. బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
15. బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు.
16. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
17. బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర - విన్స్టన్ చర్చిల్.
18. బావి లోతుకన్న మనసు లోతు మిన్న.
19. భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే.
20. భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి.
21. భగవంతుడు + కోరిక = మనిషి, మనిషి - కోరిక = భగవంతుడు.
22. భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.
23. భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
24. భవిష్యత్తుతో వచ్చిన చిక్కేమిటంటే అది మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది.
25. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.
26. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.
27. మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.
28. మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
29. మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.
30. మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
31. మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు.
32. మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
33. మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
34. మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
35. మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
36. మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
37. మంచి పనే మంచి ప్రార్ధన.
38. మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది.
39. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
40. మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
41. మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
42. మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి.
43. మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
44. మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.
45. మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.
46. మంచితనానికి మించిన మతమే లేదు.
47. మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.
48. మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
49. మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది.
50. మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.
