తెలుగు సూక్తులు - 1
1. 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
2. అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
3. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
4. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.
5. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
6. అందం అన్నది సత్యం యొక్క శోభ.
7. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
8. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు.
9. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
10. అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.
11. అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.
12. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
13. అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
14. అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
15. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
16. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
17. అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
18. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
19. అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
20. అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
21. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
22. అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
23. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.
24. అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
25. అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.
26. అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.
27. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.
28. అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
29. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
30. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
31. అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.
32. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ - థామస్ కార్ల్
33. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
34. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం
35. అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.
36. అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.
37. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
38. అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
39. అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
40. అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.
41. అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
42. అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.
43. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
44. అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.
45. అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.
46. అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.
47. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.
48. అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
49. అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.
50. అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో.
