తెలుగు సామెతలు-య

bookmark

* యజమాని చూడని చేను ఎంత పెరిగినా నష్టమే.

* యజమాని చూదని చేను ఏడుగాడు. (ఏడుగాడు=చెడిపోవుట).

* యఙ్ఞంచేసి రంకు తెలుపుకొన్నట్లు.

* యఙ్ఞానికి ఏమి యత్నమంటే, కత్తులు, కటార్లు అన్నట్లు.

* యఙ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.

* యతి అంటే, ప్రతి అన్నట్లు.

* యతికొఱకు పోతే, మతి పోయింది.

* యతిమతం మగనికి ఎత్తుబారపు పెండ్లాం (యతిమతం=వెఱ్ఱివాలకం, యతివలె నుండుట).

* యత్రజంగం తత్ర బిక్షమన్నట్లు.

* యథార్థవాది లోకవిరోథి.

* యథార్థానికి ఏడుచుట్ల తెరలు అక్కఱలేదు.

* యమునికి, శివునికి వెరువనివాడు.

* యముడు ఒక్కణ్ణిచంపితే, ఏతాము ముగ్గురిని చంపుతుంది.



**********:: యా ::**********

* యాదవకులంలో ముసలం పుట్టినట్లు.

* యాచమనాయని త్యాగము గోచులకేగాక కట్టుకోకల కగునా?

* యానాదివాదు గుద్ద కడిగినట్లు.

* యానాది లగ్నానికి ఏనాడైతే ఏమి?



**********:: యు ::**********

* యుగయుగాలనాటి యుదిష్టిరుడు వలె.



**********:: యె ::**********

* యెట్టు (వెట్టు) గొట్టిన రూక, గట్టు విడిచిన లంజ.



**********:: యో ::**********

* యోగమందు గలదె భోగమందున్నట్లు.

* యోగికి, రోగికి, భోగికి నిద్ర లేదు.