తమాషా ప్రశ్నలు -9

bookmark

1. సాధువులు ఉండని మఠం ఏది ?
కమఠం

2. పేరు లో టీ ఉన్నా త్రాగలేనిది ఎవరు ?
కమాటీ

3. ఇంట్లో మగ్గం లేని సాలి ఎవరు ?
కంసాలి

4. తగిలినా దెబ్బతగలని రాయి ఏది?
కిరాయి

5. పూసే ఏరు ?
గన్నేరు

6. పెంచు కునే సింహం
గ్రామ సింహం (కుక్క.

7. అందరూ గౌర వించే మణి
గ్రామణి

8. పండునుండి పిండలేని రసం ?
నీరసం

9. పాము మింగలేని కప్ప ?
తాళంకప్ప

10. ఏ పార్టీకీ చెందని నాయకుడు ?
వినాయకుడు

11. ఎవరి చొక్కాకి లేని జేబు ?
ఔరంగజేబు

12. పెద్దలకి పెట్టలేని పిండాలు?
మూత్రపిండాలు

13. కోపం వస్తే వచ్చే కాలు?
ఉద్రేకాలు

14. గోడ మీద ఉండే టేబుల్?
టైం టేబుల్
15. లెక్కల్లో ఉండే కారం?
గుణకారం

16. చేతి కి కట్టు కోలేని వాచీ ఏది ?
తివాచీ

17. మంచానికి లేని కోల్లు ?
పాంకోల్లు

18. గుడ్డు పెట్టని కోడి ?
పకోడి

19. తినే హారం ?
పలహారం

20. ఇంటికి వెయ్యలేని రేకు ?
పూతరేకు