తమాషా ప్రశ్నలు -19

bookmark

1. గియ్యలేని రేఖ?
లక్ష్మణ రేఖ

2. గియ్యలేని కోణం?
కుంభకోణం

3. అమలాపురం లోని హీరోయిన్ ని పిలవండి
అమలా

4. ఆరంభం లో ఉన్న హీరోయన్ ఎవరు?
రంభ

5. లోక్ పాల్ లో పక్కన ఉన్న దేశం ?
పాక్

6. అపరచితుదు తెలిసినివరికి...
పరిచితుడు

7. రుచి చెప్పలేని ఫలం?
విఫలం

8. నుదుట పెట్టుకొలేని నామాలు ?
రాజీనామాలు

9. సంగీతం లో వారం వారం జరిగేది ?
సంత

10. టీ చేసుకోలేని పాలు ?
దీపాలు

11. భక్తులు లేని సాయి?
కసాయి

12. తినే గొడుగు?
పుట్టగొడుగు

13. అమ్మ చెయ్యలేని పాకం?
కాణిపాకం

14. అమలాపురం లో నిద్ర లేపేది?
అలారం

15. దేవదాసు ప్రేయసి ఏ ఊరులో ఉంది?
పాడేరు

16. చిత్తూరు లో ఉన్న సినీ ఏక్టరు?
చిరు

17. బాతువ లో ఉన్న భంధువు?
బావ

18. సిగడాం లో తినేది?
సింగడా

19. రైలు ఆగని స్టేషను?
ఫైర్ స్టేషన్

20. మోగని గంటలు?
జడగంటలు