జోలపాట

bookmark

శ్రీరమ్యదేహ లాలీ! మాముద్దు
చిన్నారి కూన లాలీ!
గారాల కూచిలాలీ! మాయప్ప
కంజాతనయన లాలీ!
సకల లోకాధారుడూ! మునిమనో
జలజాత సంచారుడూ,
అకలంక గుణపూరుడూ, మముబ్రోచు
ఆర్యామనోహరుడూ,
ఇందీవరేక్షణుండు, నిజభక్త
బృందారకావనుండు
ఇందిందిరాలకుండూ, మముబ్రోచు
ఇందిరా నాయకుండు.
శ్రీవాగ్మనోధినేత నిజభక్త
చింతితాభీష్టదాత,
దేవేశు డా విధాత నీకు తా
దీర్ఘాయు వొసగు గాత!!