జన్మభూమి

bookmark

జన్మభూమి కన్న స్వర్గంబు వేరేది
మాతృభాష కన్న మధుర మేది
తల్లికన్న వేరె దైవమింకేదిరా?
తెలియుమోయి నీవు తెలుగు బిడ్డ!
మధుర మధురమైన మన భాష కంటేను
చక్కనైన భాష జగతి లేదు
పాలకంటి తనయులకే పలు
బలమునీయ గలవు తెలుగుబిడ్డ!
అలర పలనాటి బాలుడే అన్న యనుము
అమర రుద్రమదేవి నా కప్ప యనుము
తిక్కనామాత్యుడే గురుదేవు డనుము
ఇట్టి వీరాంధ్రజాతిలో బుట్టి అనుము