కోహినూరు

bookmark

తెనుగు తల్లీ! నీకు జోహారు
దేశమాతా! నీకు జేజేలు
నిను జూచి నిను బాడి నిను గొల్చు వేళ నా
కను లాణిముత్యాల గనులుగా నగు నహొ! ||తెనుగు తల్లీ!||
నీ పాలు జుంటి తేనియల తేటలో గోస్త
నీ పక్వరసమో సుధా పురమో యట
నా పల్కు లీ లీయనకు నోని విశ్వవా
ణీ ప్రపంచ ప్రశంసాపూరితము లాయె ||తెనుగు తల్లీ!||
కుటిల శత్రుని కోటిగుండెలో నిదురించి
యిటు సేతు సటుగంగ యెల్లంగా జగమేలు
నటరాజ కంఠవైశాల్యము నడగించు
నటుకీర్తి పెంచె నట్టి యెంతటి వాడో ||తెనుగు తల్లీ!||
ఎల్లోర కొండ నీ యల్లారు గీమటీ
కొల్లూరి కోహినూరు కొప్పులో బూచటీ
కోలారు గనులు నీ కోశంబటీ పండ్లు
పుల్లనైపోవు భోగమ్ము కన్నచో ||తెనుగు తల్లీ!||
గౌతమీ కృష్ణానదీ తుంగభద్రాది
వూత స్రవంతికా పుంజమ్ము నీ ముద్దు
కూతురై నీ చను నీ తోట పండింప
నీ తనూజులు పైడి పాతఱల్ కప్పిరే ||తెనుగు తల్లీ!||
నీ పుణ్యలేశమ్ము నాపాలి దాయనో
నా పూజకే లోకనాధుండు పొంగెనో
నీ పావనోదర శ్రీపరంపరలలో
నీ సదార్చనులలో నేను నొక్కడనైతి ||తెనుగు తల్లీ!||