కుండ చిల్లిపడిన గుడ్డ దోపవచ్చు
కుండ చిల్లిపడిన గుడ్డ దోపవచ్చు
పనికి వీలుపడును బాగుగాను
కూలఁబడిన నరుఁడు కుదుట యరుదయా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
వేమన మనుషుల గురించి ఈ విధంగా చెప్పాడు. చిల్లు పడిన కుండకు గుడ్డ పీలిక పెట్టి అవసరానికి వాడుకోవచ్చును. అది ఆ అవసరానికి బాగానే పనిచేస్తుంది. కానీ చిల్లు పడిన కుండను పారేస్తే అది పనికి రాకుండా పోతుంది. అట్లానే మనిషి చెడిపోతుంటే చెబితే విని బాగుపడితే వాడు ఉపయోగపడతాడు. కానీ వినకుండా చెడిపోయిన మానవుడిని మార్చుట కష్టము అని దీని భావం.
