ఉత్తముని కడుపున నోగు జన్మించిన

bookmark

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱచు వాని వంశమెల్ల
చెఱకు వెన్ను పుట్టి చెఱుపదా తీపెల్లా
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
వేమన శతకంలో వేమన ఉత్తముని చెరుకు గడతో పోల్చాడు. చెఱుకు గడకు కంకి పుట్టి దాని యొక్క తీపిని ఏవిధంగా నాశనం చేస్తుందో... మంచి వాని కడుపున చెడ్డవాడు పుడితే వానికే కాకుండా ఆ కుల వంశానికి మొత్తానికి చెడ్డ పేరు తీసుకువస్తాడని భావం.