అల్పబుద్ధివాని కధికారమిచ్చిన
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల దొలఁగగొట్టు
చెప్పుతినెడి కుక్క చెఱకు తీపెఱుఁగునా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
వేమన ఈ పద్యంలో తక్కువ బుద్ధి గల వాడికి ఈ విధంగా పోల్చాడు. చెప్పు తినడానికి అలవాటైన కుక్కకి చెఱకు రసం యొక్క తీపిని ఎలా గుర్తించలేదో, అల్పబుద్ధి గలవాడి చేతికి అధికారం ఇచ్చినచో గొప్పవాని గురించి తెలియక వారిని వెల్లగొట్టును.
