మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు

bookmark

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ

తార్పర్యం :
మనిషి ఎన్ని మాటలైనా చెప్పగలడు కానీ, తాను చెప్పినట్లు నడుచుకోలేదు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడు కదా అని దీని అర్థం.
sri rama