మంటికుండవంటి మాయ శరీరంబు

bookmark

మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినురవేమా..

తాత్పర్యం :
మట్టి కుండలాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమైంది. దానికి అది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ ఉంటుంది. అందుకు అశాశ్వతమైన దేహం పై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు.