మంచి మాటలు - 6
* చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.
* ప్రతి గొప్పమనిషి వెనుక ఒక గొప్ప మహిళ ఉంటుంది.
* వంట రుచి తిన్నప్పుడే బుజువు అవుతుంది.
* చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.
* తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం – షూకింగ్.
* క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
* మీకు నచ్చిన సేవకుడు కావాలంటే మీ సేవలు మీరే చేసుకోండి.
* మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
* మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.
* ప్రేమ సూర్యుడి లేత కిరణాలలాగా రోజంతా వెచ్చదనాన్ని అందజేస్తుంది.
* కష్టాల్లో చేసిన ప్రమాణాలు, సుఖాల్లో మరచిపోబడతాయి.
* నిశ్శబ్దం, వివేకాన్ని సూచించే అవకాశాలున్నాయి.
* సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.
* కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
* జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.
* వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
* మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
* చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
* మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
* గొప్పతనానికి మించిన నిరాడంబరత మరొకటి లేదు. కానీ నిరాడబరత నిజంగానే గొప్ప విషయం
