మంచి మాటలు - 3
* మీరు ఉన్న దానితో, ఉన్న విధంగా ఉండండి.
* ఆరోగ్యం, ఆనందం ఈ రెండూ ఒక దాని నుండీ లభించే మరొక వస్తువు అవుతుంది.
* అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు – ఏ.జి. గార్డెనర్.
* మూర్ఖులే ఎక్కువ ఆర్భాటాన్ని చేస్తారు.
* ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
* సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.
* వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
* గాయాలుకు పగ తీర్చుకోవడం అన్నది గాయలను భరించడం కంటే కూడా ఖరీదైనది.
* వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
* సుందరమైన వస్తువు నిరంతర ఆనందాన్ని ఇస్తుంది.
* మనలో ప్రశాంతతను మనం కనుగొనలేనప్పుడు దానికోసం బయట వెదకడం దండగ.
* అర్ధం చేసుకోగలిగితే జీవితం ఉచితమైనది. ఆపార్ధం చేసుకుంటే మాత్రం జీవితం తెవులు అవుతుంది.
* పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
* ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
* వయసు మనిషిని సాధువుగా మార్చదు.
* మతాలన్నీ ఒకే ఒక సత్యాన్ని దరిచేరే మార్గాలు.
* చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.
* కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.
* అజ్ఞాపించే స్వభావం, ఆజ్ఞాపాలనను కూడా పాటించాలి.
* చెడుకు తానుగా నిలబడేందుకు కాళ్ళు ఉండవు.
